బాలాజీ చిట్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యాజ్యమన్యంపై కేసునమోదు… జ్యుడీషియల్ రిమాండ్ కు తరలింపు.
పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 29(జనంసాక్షి)వికారాబాద్
జిల్లా తాండూరు పట్టణంలో ని బాలాజీ చిట్ ఫండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం తాండూరు మరియు తాండూరు చుట్టుపక్కల గ్రామాలలోని వారితో చిట్ ఫండ్ కంపెనీలో రూపాయలు 2లక్షల,3 లక్షల,5 లక్షల,25 లక్షల చీటీలను కట్టించి, అదేవిధంగా డబ్బులను రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద డిపాజిట్స్ కట్టించుకొని వారిని మోసం చేసి మూసివేసినటువంటి చిట్ ఫండ్ కంపెనీ పై ఈనెల 1వ తేదీన పోలీసు స్టేషన్ లో బాలాజీ చిట్ఫండ్ కంపెనీ లిమిటెడ్ లో మేనేజింగ్ డైరెక్టర్లు అయిన గంగిశెట్టి శ్రీనివాసు లు,గంగి శెట్టి గోపాలకృష్ణ, గంగిశెట్టి అనురాధ, గంగి శెట్టి సరితల మీద కేసు నమోదు
చేశామని తెలిపారు.ఇందులో ఎ-1 నేరస్తుడైన గంగి శెట్టి శ్రీనివాసులును తాండూర్ పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించామని పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి తెలిపారు.
Attachments area