బాలికను గర్భవతిని చేసిన ప్రబుద్ధుడు

సిరిసిల్ల పట్టణం :పట్టణంలోని చుక్కారావు పల్లెలో అల్వాల కుంటయ్య అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికకు మాయ మాటలు చెప్పి లోబరుచుకున్నాడు.గత కొద్ది రోజుల నుంచి బాలిక అనారోగ్యంతో ఉండటంతో ఆమెను  కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.పరీక్షించిన డాక్టర్లు బాలిక ఆరునెలల గర్భిణి అని నిర్థారించారు.బుధవారం కుల పెద్దలు పంచాయితీ జరిపి ఆమె గర్భానికి రూ.5 లక్షలు వెలకట్టారు.ఈ విషయం బయటకు పొక్కటంతో గురువారం కుంటయ్య అనే వ్యక్తితో పాటు ఇతర కుల పెద్దలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.