బాలికలను హమాలీలుగా మార్చిన కస్తూర్బా గాంధీ వార్డెన్, సిబ్బంది
ఎరుకల వెంకటేష్ గౌడ్…..
భువనగిరి. జనం సాక్షి
యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని రాంపూర్ కస్తూరిబా బాలికల హాస్టల్ లో బాలికల చేత బియ్యం బ్యాగులను మోపిస్తున్న వార్డెన్ అనిత, టీచర్లపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలకు పుస్తకాలు చేత పట్టించి చదువు నేర్పాల్సిన ఉపాద్యా యులు విద్యార్థులను హమాలీలుగా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు వారి తల్లదండ్రులు కాయ కష్టం చేసుకుంటూ ఎన్నో ఆశలతో ఇక్కడికి పంపిస్తే ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు సంబంధిత విషయంపై వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చ రించారు