బాలిక ఆత్మహత్య

భైంసా, న్యూస్‌లైన్‌: మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామానికి చెందిన రాపని చిన్ని(14) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రూరల్‌ ఎస్సై గుణవంత్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాపని సాయన్న, పోసాని దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కూతురు చిన్ని కొంతకాలంగా కగుపునొప్పితో బాధపడుతోంది. శుక్రవారం మేకలను తోలుకుని గ్రామ శివారులోకి వెళ్లింది. మధ్యాహ్న సమయంలో భోజనానికి రాకపోవడంతో సోదరుడు వెతుకుతూ వెళ్లాడు. చెట్టుకు మృతదేహం వేలాడుతూ కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.