*బాల్కొండలో బతుకమ్మ చీరలు పంపిణీ*

బాల్కొండ సెప్టెంబర్ 27 (జనం సాక్షి )నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో మంగళవారం ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్,సర్పంచి భూస సునీత,ఎంపీడీఓ సంతోష్ కుమార్,స్థానిక నాయకులతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆడబిడ్డల కోసం దసరా,బతుకమ్మ పండుగల కానుకగా బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని వారు తెలిపారు.తెలంగాణ సంస్కృతి సంప్రదయాలతో కూడిన బతుకమ్మ పండుగను అడబిడ్డలందరు సంబురంగ జరుపుకోవాలని వారు కోరారు.రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందజేయడం జరిగిందని వారు తెలిపారు.బతుకమ్మ చీరలు పంపిణీ చేసినందుకు మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి ప్రశాంత్ రెడ్డి కు కృతజ్ఞతలు తెలిపారు,ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు కన్న లింగవ్వ-పోశెట్టి,మాజీ సర్పంచి తౌటు గంగాధర్,తెరాస మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,పంచాయతీ కార్యదర్శి నల్లగంటి నర్సయ్య,వార్డు సభ్యులు పిళ్లేండ్ల శివ ప్రసాద్,గాండ్ల రాజేష్,బాద్గుణ రంజీత్ యాదవ్,గాండ్ల రాజేందర్,అక్తరి బేగం,మారా ఝాన్సీ-పురుషోత్తం,సయ్యద్ రియాజ్ అలీ,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమ్మద్ ఇఫ్తాకరోద్దీన్,APO ఇందిరా,APM గంగాధర్,సీనియర్ అసిస్టెంట్ నవీన్,జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్,తెరాస నాయకులు తోపారం గంగాధర్,జంగం రాజేశ్వర్,షేక్ ఆరిఫ్,తొగటి మురళీ,సయ్యద్ రియజాద్దీన్,CC విజయలక్ష్మి,CAలు,గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.