-బాల్యాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది.
– భావితరాలకు నడవడిక నేర్పవలసినది తల్లిదండ్రులే…
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఫోటో..
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి
సమావేశం హాజరైన జడ్పీ చైర్మన్, జిల్లా అధికారులు
వనపర్తి బ్యూరో ,జనం సాక్షి(అక్టోబర్ 22) : బాల్యం ఎంతో విలువైనదని బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో “బాలల సంరక్షణ- వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమం” పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ముందుగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పిల్లలలో మంచి నడవడిక నేర్పాలిసింది తల్లిదండ్రులేనని తెలిపారు. ప్రతి కుటుంబంలో పురుషులకు అవగాహన కల్పించి వారి పిల్లలను బాగా చదివించేలా గ్రామ సర్పంచులు, తల్లిదండ్రులు అవగాహన కల్పించాలన్నారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి పిల్లలకు అంగన్వాడీ టీచర్లు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలన్నారు. బాల్యం వెలకట్టలేనిదని సమాజం బాగుండాలంటే చిన్నపిల్లల నుండే మార్పు రావాలని అన్నారు. దేశంలో వనపర్తి జిల్లా 16 వ స్థానం లో ఉన్నది అభినందించిన మంత్రి. పిల్లలతో ఆసక్తిగా మాట్లాడాలని వారికి ఏ విధంగా నచ్చ చెబితే వింటారొ తెలుసుకోవాలని అన్నారు. సర్పంచులు ప్రజాప్రతినిధులు, గ్రామాలలో సమావేశం ఏర్పాటు చేసి పిల్లలు బడికి వెళ్లేలా చూడాలన్నారు. అన్ని రంగాలలో వనపర్తి జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని మంత్రి తెలిపారు. జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంరక్షణ, విద్య తదితర అంశాలపై అంగన్వాడీ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని తెలిపారు. సర్పంచ్ నుండి జెడ్పిటిసి వరకు అందరూ సమిష్టిగా కృషి చేస్తే జిల్లా ముందంజలో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్,జడ్.పి. సి.ఈ. ఓ.వెంకట్ రెడ్డి డిడబ్ల్యూఓ పుష్పలత , జిల్లా అధికారులు , సి.డి.పి.ఓ.అలివేలమ్మ యం.పి. డి. ఓ. లు, జడ్పీటీసీలు ఎంపీపీలు, సర్పంచులు, అంగన్వాడి టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.