బాల్య వివాహాలకు కఠిన చర్యలు: నన్నపునేని
చిత్తూరు,జూన్15(జనం సాక్షి): బాల్యవివాహాలు చేసే తల్లిదండ్రులను, బంధువులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మహిళా కమిషనర్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి అన్నారు. నగరి పట్టణ బైపాస్ ఎ.జె.ఎస్ కళ్యాణ మండపంలో చిత్తూరు పోలీసు ఉన్నతాధికారుల సౌజన్యంతో పుత్తూరు సబ్ డివిజన్ పోలీసు అధికారి భవానీ శ్రీహర్ష ఆధ్వర్యంలో బాల్యవివాహలు – పర్యవసానాలు. ఫేజ్ 2,హ్యకాథాన్ – మహిళా భధ్రత సమేళనం వర్క్ షాపు – 6, కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మహిళా కవిూషనర్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారి,చిత్తూరు జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు పాల్గోన్నారు..ఈ సంధర్భంగా నన్నపనేని మాట్లాడుతూ…బాల్యవివాహలను అరికట్టి నవ సమాజ నిర్మాణ విలువలను కాపాడాలన్నారు. నేటి సమాజంలో మహిళలకు ప్రాధాన్యత కలుగుతున్నదన్నారు. మహిళ ఏక్కడ పూజింపబడుతోందో అక్కడ సిరులు పండుతాయని తెలిపారు.నేడు జరుగుతున్న మహిళలపై,బాలికలపై హత్యాచారాలు తలుచుకంటే చాలా భాదగా వుందవి తెలిపారు.