బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలి,

ఏఐటీయూసీ  జాతీయ కార్యవర్గ సభ్యులు ఉజ్జిని రత్నాకర్ రావు పిలుపు
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని *ఏఐటీయూసీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఉజ్జిని రత్నాకర్ రావు* పిలుపునిచ్చారు . శనివారం నల్లగొండలోని పిఆర్టియు భవన్లో  ఏఐటీయూసీ ,ఇలొ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో జరిగిన పత్తి కార్మికుల జిల్లా వర్క్ షాప్ లో ఆయన మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన ఇంకా పది కోట్ల మంది బాల కార్మికులు ఉండడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.ఇలొ సహకారంతో ఏఐటీయూసీ  ఆధ్వర్యంలో రాష్ట్రంలోని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం జిల్లాలో సదస్సులు నిర్వహించి ప్రజలను విద్యార్థులను చైతన్య పరుస్తామని ఆయన తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పత్తి కార్మికులకు సామాజిక న్యాయం, కనీస వేతనాలు వారి జీవన స్థితిగతులను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అన్నారు. పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు సామాజిక భద్రత రక్షణ కల్పించాలని కోరారు. స్త్రీ పురుషుల మధ్య వేతనాల్లో వ్యత్యాసం లేకుండా చూడాలని, కనీస వేతనాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానం మెరుగుపరచకుండా ,వారి ఆర్థిక అవసరాలను తీర్చకుండా బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యం కాదు అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు భద్రత కల్పించాలని కోరారు. చిన్న సన్నకారు రైతులు ప్రయోజనాల  కాపాడడం కోసం రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, మార్కెట్ వసతి  ఏర్పాటు చేయాలని కోరారు.
*అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ మహమ్మద్ హలీం* గారు మాట్లాడుతూ కార్మిక హక్కుల పరిరక్షణ కోసం మెరుగైన జీవన విధానం కోసం  ఇలొ (ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ )కృషి చేస్తుందని  అన్నారు. చిన్నపిల్లలను పనికి పంపకుండా బడికి పంపాలని కోరారు.  బాల కార్మికుల చేత పనిచేస్తే కార్మిక శాఖ ఆధ్వర్యంలో వారి మీద చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ జిల్లా వర్క్ షాప్ కు ఏఐటీయూసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అధ్యక్షత వహించగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ,టిఆర్ఎస్కెవి జిల్లా అధ్యక్షులు గుర్రం వెంకటరెడ్డి, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్,ఐఎన్టియుసి జిల్లా ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి ,  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ చింత కృష్ణ, డి సి పి ఓ (డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్) కే గణేష్ ,సిఆర్పిఎఫ్ జిల్లా కోఆర్డినేటర్  ఎర్ర శివరాజ్, తదితరులు మాట్లాడుతూ కార్మికులకు సామాజిక భద్రత గౌరవ వృత్తి కల్పించాల్సిన అవసరం అందరిపై ఉందని వాటికోసం సమిష్టిగా ప్రయత్నం చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎల్ శ్రావణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి బోలుగూరి నరసింహ, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి గిరి రమా ఏఐటీయూసీ  జిల్లా అధ్యక్షులు నల్పరా సతీష్ ,కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చాపల శ్రీను , రామస్వామి, పనెమ్ వెంకట్ రావు, ఎండీ సయీద్, ప్రజానాట్యమండలి నాయకులు పరమేష్, ఎన్ ఆర్ సీ  రాజు తదితరులు పాల్గొన్నారు.