బాల త్రిపుర సుందరి దేవిగా సంతోషి మాత

సూర్యాపేట టౌన్ (జనంసాక్షి):దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక సంతోషిమాత దేవాలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు ఇరువంటి శివరామకృష్ణ శర్మ భక్తులనుద్దేశించి మాట్లాడుతూ బాలదేవి మహిమాన్వితమైన తల్లి అని, శ్రీ బాలమంత్రం సమస్త మంత్రాలలో గొప్పదన్నారు. శ్రీవిద్యా ఉపాసకులు మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారని తెలిపారు.పవిత్రమైన శ్రీచక్రంలో ఉండే మొదటి దేవత బాలాదేవి అని చెప్పారు.తొమ్మిది రోజుల పాటు జరిగే అలంకరణలలో భక్తులకు పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీ బాలాదేవి అన్నారు. అంతకుముందు దేవాలయంలో శ్రీ సత్యసాంబశివ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు , శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణ భక్తులకు ప్రత్యేక కుంకుమార్చన పూజలు , చండి హోమం, రుద్ర హోమం, సామూహిక లలితా సహస్రనామ పారాయణం, సుహాసిని పూజ,భవాని మాలా దీక్ష స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించారు.నేడు గాయత్రీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ అధ్యక్ష, కార్యదర్శులు నూక వెంకటేష్ గుప్తా, మురళీధర్, కోశాధికారి రామ్మూర్తి, కమిటీ సభ్యులు యామ పురుషోత్తం, బెలిదే అశోక్, నామిరెడ్డి పాపిరెడ్డి, దేవరశెట్టి సోమయ్య, మహంకాళి ఉపేందర్, నూక రవిశంకర్, గాయం శ్రీదేవి కక్కిరేణి పద్మావతి, కంచర్ల లీల భక్తులు తోగిటి మురళి, డోగుపర్తి ప్రవీణ్ కుమార్, భవాని, రాజ్యలక్ష్మి ,కనకరత్నం, జగదీశ్వరి, పోతుగంటి కృష్ణవేణి, నర్సిని కావ్య,లక్ష్మీ, దేవరశెట్టి ఉమారాణి, తంతెనపల్లి వెంకన్న , అర్చకులు మంగిపూడి వీరభద్ర శర్మ, బాబ్జి శర్మ , దేవాలయ మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.