బాల నేరస్థుడి విడుదలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ

3

న్యూఢిల్లీ,డిసెంబర్‌21(జనంసాక్షి): నిర్భయ కేసులో బాల నేరస్థుడి విడుదలపై స్టే ఇవ్వాలంటూ దిల్లీ మహిళా కమిషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ నిర్భయ ఘటనలో బాల నేరస్థుడు  విడుదలైన సంగతి తెలిసిందే. అయితే బాల నేరస్థుడిని విడుదల చేయడాన్ని నిర్భయ తల్లిదండ్రులతో పాటు, పలు మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో బాల నేరస్థుడి విడుదలపై స్టే విధించాలని దిల్లీ మహిళా కమిషన్‌ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై సోమవారం విచారించిన సుప్రీంకోర్టు… అతడి విడుదలపై స్టే విధించలేమంటూ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇది తమకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని నిర్భయ ఆశాదేవీ బాధాతప్త హృదయంతో అన్నారు. ఇది చట్టాన్ని బలహీన పనరిచే చర్యగా, రేపిస్టులకు భరోసా కల్పించేదిగా ఉందన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తూనే ఉంటామన్నారు.  ప్రభుత్వం, రాజ్యాంగ వ్యవస్థల చేతిలో మోసపోయాం అని ” తల్లి డిసెంబరు 16,2012న తమ కూతురిని అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన వాడిని బయటకెలా వదిలిపెడ్తారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు తీవ్ర అన్యాయం చేశాయని విూడియాతో మాట్లాడుతూ అన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం ఏం నేర్చుకుంది? సుప్రీం కోర్టుకు తన నిరసనకు స్పందిస్తోన్న సమయంలోనే అంత ఆదరాబాదరాగా విడుదల చేయాల్సిన అవసరమేంటని ఆమె ప్రశ్నించారు. నిర్వహణా వ్యవస్థకూ ప్రభుత్వానికీ తప్ప అందిరకీ తమ బాధ అర్థమవుతోందనీ, బాధితులకు సాయపడేవారు ఈ దేశంలో కరువయ్యారని ఆమె విలపించారు.నిరసనలు, అభ్యంతరాల మధ్య నిర్భయ జ్యోతి సింగ్‌ అత్యాచార కేసులో బాల నేరస్తుడు ఆదివారం విడుదలయ్యాడు. బాల నేరస్తుడికి ప్రస్తుతం 20 ఏళ్లు వయసు వచ్చినందున అతణ్ణి విడుదల జేయరాదంటూ జంతర్‌మంతర్‌ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రదర్శకులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. నిర్భయ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.  దీనిపై నిర్భయ తల్లి స్పందిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపే తమ ప్రజాతంత్ర హక్కును మోడీ ప్రభుత్వం కాలరాచిందని విమర్శించారు. బాలనేరస్తుని విడుదలను సవాల్‌ చేస్తూ శనివారం రాత్రి బాగా పొద్దుపోయాక నిర్భయ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచరాణ చేపట్టింది. మూడేళ్ల నాటి నిర్భయ కేసులో బాల నిందితుడిగా ఇప్పటివరకూ జువైనల్‌ ¬ంలో శిక్షను అనుభవించిన రేపిస్ట్‌ను విడుదల చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్‌ స్వాతి మలివాల్‌ శనివారం రాత్రి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఈ కేసును కోర్టు అనుమతించటంతో ప్రస్తుతం ఇది న్యాయపరిధిలోకి వెళ్లిందని భావించారు.  కేసు విచారణ పూర్తయ్యే వరకూ నేరస్తుడిని జువైనల్‌ ¬మ్‌లోనే వుంచగలరని ఆశిస్తున్నామన్నారు. అయితే ఈ నేరస్తుడు ఆదివారం సాయంత్రమే జువైనల్‌ ¬ం నుండి విడుదల కావటం గమనార్హం. చివరకు సోమవారం దీనిపై సుప్రీం చేతులెత్తేసింది.