బావిలోపడిన ఎలుగుబంటి

ఎనుగొండపాళెం: ప్రమాదవశత్తు నీరులేని బావిలో సడిన ఎలుగుబంటిని గ్రామస్తులు ఆటవీశాధికారులు రక్షించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పాళెంకొండ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఎలుగుబంటి బుధవారం రాత్రి బద్తిరెడ్డిగారిపాలెం వద్ద నీరు లేని వ్యవసాయ బావిలో పడింది. ఆర్తనాదాలు విన్న గ్రామస్థులు అటవీశాఖధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ ఎఫ్‌ఆర్‌వో వేణుగోపాల్‌, ఎఫ్‌ఎఫ్‌వో జ్యోతి, గ్రాస్థులు గంటపాటు శ్రమించి తాళ్ల సాయంతో దాన్ని పైకి లాగారు. అనంతరం అడవిలో వదిలారు.