బావిలో పడిన ఎలుగుబంటి
మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజెర్ల గ్రామ శివారులోని రైతు వ్యవసాయ బావిలో ఓ ఎలుగుబంటి పడింది. సమీప అటవీప్రాంతం నుంచి తాగునీటి కోసం వెతుక్కుంటూ వచ్చి ఎలుగుబంటి బావిలో జారిపడిందని స్థానికులు చెప్పారు. అటవీశాఖ అధికారులకు సమాచారమందించి ఎలుగును బయటకి లాగేందుకు గ్రామస్థులు ప్రయత్నాలు చేపట్టారు.