బావిలో పడిన ఎలుగుబంటి

కోహెడ, జనంసాక్షి: కరీంనగర్‌ జిల్లా కోహెడ పంచాయితీ పరిధిలోని ధర్మసాగర్‌పల్లిలో ఓ ఎలుగుబంటి వ్యవసాయబావిలో పడింది. సమీప అటవీప్రాంతం ఎలుగుబంటి నీటి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో జారిపడిందని తెలిపారు. అటవీశాఖ అధికారులకు సమాచారమందించి ఎలుగుబంటిని బయటకి తీయడానికి గ్రామస్తులు ప్రయత్నిస్తున్నారు.