బాసరలో పేలిన సిలిండర్..

ఆదిలాబాద్ : బాసర మండలం శారదానగర్‌లో బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో సిలిండర్ పేలింది. సిలిండర్ పేలడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.