బాసరలో పోటెత్తిన భక్తజనం
బాసర : దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతి అమ్మవారి అలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడిరది. వేసవి సెలవులు ముగింపు దశక రావడంతో తమ పిల్లలకు అక్షర శ్రీకారం చేయించడానికి రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ ఉదయం నుంచి భక్తులు గోదావరి నదిలో స్నానాలు అచరించి అలయానికి చేరుకుని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి తమ మొక్కులను తీర్చుకున్నారు. అలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.