బాసరలో పోటెత్తిన భక్తులు

ఆదిలాబాద్‌, జనవరి 28 (): దక్షిణభారతదేశంలోనే పేరుగాంచిన బాసర సరస్వతి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. గత మూడు రోజులుగా వరుసగా సెలవు దినాలు రావడంతో భక్తులు భారీ సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ నుండే కాకుండా మహారాష్ట్ర నుండి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అక్షరాభ్యాసాలు తమ పిల్లలకు చేయించారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయానికి ఈ మూడు రోజులలో సుమారు 10 లక్షల ఆదాయం రావడం జరిగింది.