బాసరలో భక్తుల ఇక్కట్లు
ఆదిలాబాద్: వసంత పంచమి వేడుకలు బాసరలో వైభవంగా జరుగుతున్నాయి. నేడు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలను చేయించేందుకు భారీసంఖ్యలో భక్తులు బారులు తీరారు. మరోవైపు వసతి, ఇతర సౌకర్యలు లేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో ఆలయ సిబ్బంది విఫలమయ్యారని పలువురు ఆరోపించారు.