బాసర ట్రిపుల్ ఐటీ లో ఆత్మహత్యకు ప్రభుత్వమే భాద్యత వహించాలి
..జాజుల లింగంగౌడ్.
మిర్యాలగూడ. జనం సాక్షి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి,విద్యాశాఖ మంత్రి చేతకాని తనం వల్లే బాసర ట్రిపుల్ ఐటీ లో సురేష్ రాథోడ్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది చాలా బాధాకరమైన విషయం.ఇది ముమ్మాటికీ తెలంగాణ ప్రభుత్వ హత్యగా భావిస్తున్నాం.విద్యాశాఖ మంత్రి ద్వంద వైఖరి వల్ల,బాసర విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం వల్లనే, సురేష్ అనే విద్యార్థి అత్మహత్య చేసుకున్నట్టు జాజుల పేర్కొన్నారు.ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.ప్రభుత్వం వెంటనే స్పందించి మృతుని కుటుంబానికి 50లక్షల ఎక్స్ గ్రేషియా,కుటుంబంలో అర్హులైన వారికి ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని లింగంగౌడ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,ఎర్రబెల్లి దుర్గయ్య,దాసరాజ్ జయరాజ్,చేగొండి మురళి యాదవ్,కుమ్మరికుంట్ల సుధాకర్,అంజి యాదవ్ తదితరులు పాల్గొన్నా