బాసర ట్రిపుల్ ఐటీ లో మత ప్రచార కలకలం..

విద్యార్థుల హాస్టల్ కి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో చెక్కర్లు.
– పూర్తి వివరాలు తెలవడానికి త్రిసభ్య కమిటీ వేశామని తెలిపిన సిబ్బంది.
బైంస రురల్,,నవంబర్10,,జనంసాక్షి,,,  నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ లో మత ప్రచారం జరుగుతుందంటూ కలకలం రేపుతుంది. తాజాగా ఇట్టి విషయమై సోషల్ మీడియాలో మత ప్రచారం ఇన్ బాసర ట్రీబుల్ ఐటీ అని,ట్రీబుల్ ఐటీ లో పనిచేస్తున్నా ఓ ఉద్యోగి సహాయంతో ముగ్గురు ప్రచారకులు ట్రీబుల్ ఐటీ లో ప్రవేశించి,హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మత ప్రచారం చేశారని పుకార్లు చక్కెర్లు కోడుతుంది.ఇదే విషయమై బాసర త్రిబుల్ ఐటీ సిబ్బందిని అడగగా పూర్తి వివరాలు తెలుసుకుంటున్నామని,మత ప్రచారం జరిగిందన్న విషయాలను పరిశీలిస్తున్నామని,దానికై అన్నీ కోణాలలో నివేదిక అందించడానికి త్రి సభ్య కమిటీ వేశామని,ఆ కమిటీ గురువారం మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు రిపోర్ట్ అందిస్తుందని అప్పటికి నిజానిజాలు బయటపడతాయని తెలిపారు. అయితే ప్రచారం కోసం వచ్చారు అంటున్న వారిలో ఒకరు విద్యార్థి పేరెంట్ అని తెలిసింది. ఏదేమైనా ట్రిపుల్ ఐటీ లో మత ప్రచారం జరిగిందా..?లేదా..? అన్న విషయ౦ సాయంత్రం వరకు తెలుస్తుంది