బిఆర్ఎస్ నాయకుడు భీమనబోయిన రవి కుమార్ మృతి
డోర్నకల్ మార్చి/7/జనం సాక్షి న్యూస్: డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామానికి చెందిన టిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ యూత్ అధ్యక్షుడు,మాజీ ఆటో యూనియన్ అధ్యక్షుడు భీమనబోయిన రవికుమార్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వారి పార్థివదేహాని ఘన నివాళులు అర్పించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థించిన మాజీ జెడ్పిటిసి గొర్ల సత్తిరెడ్డి, స్థానిక సర్పంచ్ చేరెడ్డి సమ్మిరెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు మేకపోతుల శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు నిమ్మనగొట్టు నాగభూషణం, బీమనబోయిన శ్రీశైలం,గిరి, ఆటో డ్రైవర్లు,గ్రామ పెద్దలు తదితరులు నివాళులు అర్పించారు.