బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్న..బిఆర్ఎస్ మండల కమిటీ నాయకులు.

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించిన సందర్భంగా స్వీట్లు పంచి సంబురాలు జరుపుకున్న..బిఆర్ఎస్ మండల కమిటీ నాయకులు.

ఏటూర్ నాగారం,
అక్టోబర్16(జనంసాక్షి).
మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు బిఆర్ఎస్ పార్టీ ఏటూరునాగారం మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల మ్యానిపేస్టో ప్రకటించిన సందర్భంగా స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిఆర్ఎస్ పార్టీ 2023 మేనిఫెస్టో తెలంగాణ రాష్ట్రానికి ఎంతో గౌరవం తెలంగాణ ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడని మరోసారి నిరూపించుకున్న మన ప్రియతమ నాయకులు కల్వకుంట్ల. చంద్రశేఖర రావుని మూడోసారి ముఖ్యమంత్రిగా చేసి మనం మనకర్తవ్యాన్ని నెరవేర్చుకోవాలని,
కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల తో ఆగమాగం అవుతుంటే మన కేసీఆర్ పేదల పక్షాన పేదల కోసం నిలబడి ఈరోజు 2023 మేనిఫెస్టోలో ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి ఐదు లక్షల ప్రమాద బీమా సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా విలేకరులకు ఉచిత గ్యాస్ 400 రూపాయలుకే గ్యాస్ ప్రమాద బీమా 15 లక్షల రూపాయలు చెప్పడం 10% చేయడం 90% ఉంటదని చెప్పడం జరిగింది.ములుగు జిల్లా ఇంకా అభివృద్ధి చెందాలి, మన ములుగు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగ జ్యోతిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమతిగా ఇవ్వాల్సిన బాధ్యత మన ములుగు నియోజకవర్గంలోని ప్రజలందరి మీద ఉందని మనమందరం కేసీఆర్ సుపరిపాలనకి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు గడదాస్ సునీల్ కుమార్,సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి, ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి, ఎంపీపీ అంతటి విజయ నాగరాజు, ఎంపీటీసీ కుమ్మరి స్వప్న చంద్రబాబు, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, మాజీ మండల పాట అధ్యక్షులు కోనూరు మహేష్ గౌడ్, మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ సప్పిడి రాంనర్సయ్య, కొండాయి చిన్ని, కాళ్ల రామకృష్ణ, బట్టు రమేష్, విజయ్, దడిగల లక్ష్మణ్, తాండ్ర సతీష్, కన్నెబోయిన రాజు,  ఎర్రలే ఎల్లయ్య, చిన్న బిక్షపతి, వలస మధు, పర్వతాలు ఎల్లయ్య దడిగల లక్ష్మణ్, అల్లంల చంటి, చాంద్ బాబా, బాసాని శేఖర్, కావేరి చిన్నికృష్ణ, దేపాక శ్రీరామ్, పోడం శోభన్, కొయ్యల నరసింహారావు, వావిలాల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.