బిచ్కుందలో ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటు

బిచ్కుంద సెప్టెంబర్ 28 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో ప్రభుత్వ ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటుకు అనుమతి మంజూరు అయినట్టు జుక్కల్ శాసన సభ్యుడు హన్మంత్ షిండే ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతు బిచ్కుంద ప్రజల చిరకాల కోరిక ఉర్దూ మీడియం జూనియర్ కళాశాల ఏర్పాటుకు 2022 – 23 సంవత్సరానికి గాను ఎంపీసీ, బైపీసీ, సీఈసీ మరియు హెచ్ఈసీ గ్రూపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. చాలా మంది విద్యార్థిని,విద్యార్థులు దూర ప్రాంతములోకి వెళ్లి చదువుకోలేక చదువు మానేయడం జరిగిందని అన్నారు. ఉర్దూ మీడియం కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఇంటర్ బోర్డు కమీషనర్ కు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందినగా విద్యార్థిని విద్యార్థులకు విజ్ఞప్తి చేసారు.
చిరకాల స్వప్న నిజమైనందుకు మద్నూర్ జుక్కల్ బిచ్కుంద మండల ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.