బిజెపి ఎస్సీ మోర్చా మండల కమిటీ ఎన్నిక……

టేకుమట్ల.సెప్టెంబర్09(జనం సాక్షి)భారతీయ జనతా పార్టీ ఎస్పీ మోర్చా మండల అధ్యక్షుడిగా మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి రవీందర్ ను ఏకగ్రీవంగా నియమించినట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భట్టు రవి తెలిపారు.ఎస్సీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శులుగా కొరిమి రమేష్,మిట్టపెల్లి శ్రీకాంత్ లను ఎన్నుకున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బండారు రవీందర్,ప్రధాన కార్యదర్శి ఆకునూరి సదయ్య,ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు బట్టల మొగిళి,బీజేవైఎం మండల అధ్యక్షుడు కొలుగూరి రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.