బిజెపి, కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరిక.

వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే.
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 16 జనం సాక్షి.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో
గద్వాల మండల పరిధిలోని చెనుగొనిపల్లి గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి,భాస్కర్ రెడ్డి,శివారెడ్డి,దేవేందర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీరితో 100మంది పైగా ఆ పార్టీలకి గుడ్ బై చెప్పి నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కెసిఆర్ నాయకత్వాన్ని బలపరుచుట కు బిఆర్ఎస్ పార్టీలోకి ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే. వీరి పాటు కళ్యాణ్ రవి పర్ష సురేష్ బీముడు పరీక్ష పాండు ప్రవీణ్ శ్రీకాంత్ మహేష్, శివ ఇమ్రాన్ కళ్యాణ్ మంజునాథ్ శివ శీను హేమంతు ప్రవీణ్, గణేష్ నాగేంద్ర వెంకటేష్ శివ కిషోర్ జయన్న, అశోక్, నాగన్న డబ్బా రాములు ఈదన్న భాస్కర్ వెంకటన్న మేస్త్రి శివ డ్రైవర్ రాముడు వీరన్న పంపూర్ణ ఆచారి దాసరి శీను, మైబు హరిబాబు అరుణ్ రాజు ఫయాజ్ , కార్తీక్ సోహుల్ మహేష్ నరేష్ నజీర్ శాలం సాయిరాం పరశురాముడు శీను మళ్లీ తిరుపతి నవీన్ రాజు వెంకటేష్ పురుషోత్తం శివ జయన్న అంజి లక్ష్మణ్ నరేష్ వెంకటేష్ పాపి ప్రకాష్ నాగేష్ యాదగిరి అశోక్ నరసింహ మురారి లక్ష్మణ్ శాలు ,సమీర్ నరసింహ ఇమ్రాన్ పరుశురాముడు ,నరేష్ విష్ణు ప్రశాంత్ రాములు హనుమంతు నర్సింహులు బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే బిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు, దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి, కార్యక్రమాలు ఈ 9 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నది అని ఎమ్మెల్యే పేర్కొన్నారు, బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని, ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో చిచ్చులు పెట్టడానికి కులాల పేరుతో మతాల పేరుతో రంగురంగుల వేషాలు వేసుకొని మాయమాటలు చెప్పి సోదర భావంతో ఉన్న మన మధ్యల చిచ్చు పెట్టడానికి వస్తారనీ, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఒక సారి సీఎం కెసిఆర్ ని, నన్ను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు చెన్నయ్య వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ ప్రతాప్ గౌడ్, జడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ నాయుడు, సత్య రెడ్డి విక్రమ్ సింహరెడ్డి, మహేశ్వర్ రెడ్డి సూరి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.