బిజెపి ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో పింఛన్లు 600
టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లు 2016
ప్రజలకు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
జనంసాక్షి రాజంపేట్ సెప్టెంబర్ 27
రాజంపేట్ మండలంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం లో కల్యాణ లక్ష్మి 32,ఆసరా పింఛన్ కార్డులు 590 ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణీ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 57 సంవత్సరాలు పైబడిన వారికి అర్హులందరికీ వితంతు, వృద్ధాప్య పెన్షన్, బీడీ పెన్షన్, వికలాంగుల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. మహారాష్ట్ర, బొంబాయి అటువంటి రాష్ట్రాలు కూడా పెన్షన్ లు 600 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్లు 12 లక్షల పెన్షన్స్ పంపిణీ చేయడం జరుగుతున్నది.కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం 2016 రూపాయల పెన్షన్ ఇస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం 46 లక్షల పెన్షన్లు ఇస్తున్నారని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు, రైతు బీమా , వంటి ఎన్నో అభివృద్ధి పథకాల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది. బిజెపి ఏతర రాష్ట్రాల్లో 80 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రం పెన్షన్లు ఇస్తున్నారని చెప్పడం జరిగింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం మాత్రం రైతులకు మీటర్లు పెట్టాలని చెబితే దానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు, రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వెళుతుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం బిజెపి ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని చెప్పడం జరిగింది. ఎంపీపీ స్వరూప, జడ్పిటిసి కొండ హనుమాన్లు, సర్పంచ్ శ్రీజ రమేష్ రెడ్డి, ఎంపీటీసీ సుమలత, సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్, సర్పంచ్లు సత్తయ్య, బీరయ్య, లక్ష్మి, జీవులు, స్వాతి, పార్వతి, ఎంపీటీసీ హాజీ నాయక్, ఎంపిటిసి సాగర్, సీనియర్ నాయకులు నీరడీ శంకర్, పార్టీ గ్రామ అధ్యక్షులు గంగారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
2 Attachments • Scanned by Gmail
ReplyForward
|