బియ్యం పంచాయితీలో దోషులు ఎవరు ?
ఉభయ తెలుగు రాష్టాల్ల్రో అకాల వర్షానికి పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. అనేక ప్రాంతాల్లో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం కుప్పలు పూర్తిగా తడిసిపోయాయి. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం కారణంగా తడిసి ముద్దవ్వడంతో ఇప్పుడు కొనుగోళ్లకు మళ్లీ ఆందోళన చేయాల్సిన దుస్థితి ఏర్పడిరది. సీజన్ వచ్చి దాదాపు నెల రోజులుకావస్తున్నా కేంద్రం రాష్టాల్ర మధ్య కొనుగోళ్ల పంచాయితీ జరుగుతోందే తప్ప ధాన్య కాంటాల కెక్కడం లేద. రకరకాల కారణాలతో కొర్రీలుపెడుతున్న మార్కెట్ అధికారులు, తడిసినధాన్యం వైపు చూడడం లేదు. కనీసం ధాన్యం తేమగా ఉన్నా తీసుకోవడం లేదు. వాతావరణంలో మార్పులతో ధాన్యం తేమ ఎక్కుతోంది. పొడి ధాన్యం కోసం ఆరబోస్తే తడిసిపోయింది. పలుచోటల ధాన్యం కొట్టుకు పోయింది. నానా రకాలుగా తంటాలు పడుతున్నరైతులను ఆదుకునేలా కార్యాచరణ చేయకుండా నేతలు రాజకీయాలు చేస్తున్నారు. కొనుగోళ్లలో ఆలస్యం చేస్తున్న అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ ధాన్యం తడిసిపోయిందని వారు ఆరోపిస్తున్నాచారు. వారంరోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదు. అందువల్లే ఈ దుస్థితి ఏర్పడిరది. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం ఇచ్చుకోవాలి. పరస్పర విమర్శలు,ఆందోళనలతో రైతులను మోసం చేసే యత్నాలను కట్టిపెట్టాలి. ఉప్పుడు బియ్యం కొనమని కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిని దాచిపెట్టి మాట్లాడడం సరికాదు. మిల్లర్లు బియ్యం ఇవ్వకుండా కేవలం ఉప్పుడు బియ్యం మాత్రమే తయారు చేస్తా మని అనడంలోనూ మతలబు ఉంది. ప్రభుత్వం కూడా వారికే మద్దతు పలికి గుడ్డిగా కేంద్రాన్ని విమర్శిం చడం ద్వారా తన తప్పును కప్పిపుచ్చుకోజాలదు. అందువల్ల నేరుగా కేంద్రం ఏ బియ్యం అయితే తీసుకుంటానని చెబుతుందో అవే బియ్యం ఇవ్వాలి తప్ప..ప్రజలు ఎవరు కూడా తినని ఉప్పుడు బియ్యం ఇస్తామని చెప్పడం వెనక కుట్రలను కప్పిపుచ్చలేరు. రా రైస్ కొంటామని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో బియ్యం మాత్రమే ఎఫ్‌సిఐకి అందించే ఏర్పాట్లు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ది చాటుకోవాలి. తెలంగాణలో యాసంగిలో పండే వడ్లు క్వింటాలుకు కేవలం 65 కిలోల బియ్యం మాత్రమే వస్తాయి. యాసంగిలో నూక ఎక్కువ అవుతుంది. అందువలన ఉడకబెట్టి బియ్యం తీస్తారు. ఇలా ఐతే 80 కిలోల బాయిల్డ్ బియ్యం వస్తాయి. అంటే అదనంగా 15 క్వింటాల్స్ బియ్యం వస్తున్నాయి. ఇక్కడే అసలు కథ ఉన్నది. కేంద్రం` రాష్ట్రం ఒప్పందం ప్రకారం ప్రతి క్వింటాల్ వడ్లకు 65 కిలోల బియ్యం రాష్ట్రం ఇవ్వాలి. ఎక్కువ తక్కువలతో సంబంధం లేదు. కాని బాయిల్డ్ ఎప్పుడూ కూడా తక్కువ రాదు. మరి ఇక్కడ 15 క్వింటల్స్ బియ్యం ఎక్కువ వచ్చాయి. ఎక్కువ వచ్చాయని కేంద్రానికి రాష్ట్రం చెప్పదు. ఉచితంగా కూడా ఇవ్వదు. ఆ 15 క్వింటాల్స్ బియ్యంకు కూడా సరిపడే వడ్లకు లెక్కను చూపిస్తుంది. అంటే 15 క్వింటాల్స్ బియ్యం రావడానికి 25 క్వింటాల్స్ వడ్లు కొన్నట్లుగా చూపుతుంది. తెలంగాణ మొత్తం కొన్న వడ్లు 125 క్వింటాల్స్ అని అవాస్తవ లెక్క చూపుతుంది. ఇలా అదనపు బియ్యం వల్ల అప్పనంగా వస్తున్న ఆదాయం అక్షరాల 64000 రూపాయలు. అదనంగా వస్తున్న ఆదాయం తలాకాస్తా పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే బాయిల్డ్ రైస్ వద్దన్నందుకు ఇంత రాద్దాంతం చేస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించాలి. కేంద్రం కూడా ఈ విషయంలో నిజాలు తెలుసకుని బహిరంగ ప్రకటన చేయాలి. బిజెపి నేతలు కూడా ఇదే నిజమయితే ప్రజలకు, ముఖ్యంగా రైతులకు తెలియచేయాలి. రైసు మిల్లుల వ్యవహారంపై నిలదీయాలి. ఇకపోతే తెలంగాణలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆహారధాన్యాల ఉత్పత్తి పెరిగింది. పంటల ఉత్పత్తిలో దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. వరిధాన్యం ఉత్పత్తితో దేశానికే ధాన్యాగారంగా మారింది. ఆహారపంటల ఉత్పత్తిలో దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణ నిలిచిందని కేంª`దరం కూడా ఒప్పుకుంది. అయితే ఆహారధాన్యాల ఉత్పత్తిలో రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వాలు ఏనాడూ గుర్తించడం లేదు. ఇకపోతే స్థాయికి మించి ఉత్పత్తి జరిగినప్పుడు వాటినేం చేయాలన్నది కేంద్రమే ఆలోచించాలి. వరిధాన్యాన్నే తీసుకుంటే.. దక్షిణాది రాష్టాల్ల్రోనే బియ్యాన్ని ఆహారంగా ఎక్కువగా తీసుకుంటారు. ఉత్తర భారతంలో గోధుమ ప్రధాన ఆహారం. దేశీయ అవసరాలకు మించి వరిధాన్యం ఉత్పత్తి అయినప్పుడు ఆ ధాన్యాన్ని ఎగుమతి చేయటం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. అనేక దేశాలు అన్నం కోసం అల్లాడుతున్నాయి. మనదేశంలో కూడా చాలామందికి నేటికీ తిండిగింజలకు నోచుకోవడం లేదు. వరిధాన్యం ఉపయోగించుకునేందుకు వ్యవసాయా ధారిత పరిశ్రమలు నెలకొల్పాలి. ఇవేవీ చేయకుండానే ఇప్పటికే నిల్వలు పేరుకుపోయాయని, అవసరాని కన్నా ఉత్పత్తి ఎక్కువ ఉంటే తామేవిూ చేయలేమని చేతులెత్తేయటం బాధ్యతారాహిత్యమే కాగలదు. ధాన్యం సేకరణలో విస్పష్ట విదానం ఉండాలి. తెలంగాణ, ఇప్పుడిప్పుడే కష్టాల నుంచి గ్టటెక్కుతున్నది. గతంలో 40 లక్షల ఎకరాలకు మించని సాగు భూమి, నేడు కోటి 20 లక్షల ఎకరాలకు చేరుకున్నది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ప్రధాన పంట అయిన వరి దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చింది. రాష్ట్ర అవసరా లనే తీసుకుంటే ఒక పంటలో వచ్చే ధాన్యమే సరిపోతుంది. మిగతా ధాన్యాన్ని కొనాల్సిన బాధ్యత కేంద్రానిదే కాగలదు. ఒకవేళ బాయిల్డ్ రైస్ కొనడం కుదరదని చెప్పాలనుకుంటే నేరుగా చెప్పాలి. రాష్టాన్రికి లేఖ రాయలి. రాష్ట్రప్రభుత్వం కూడా ఉప్పుడు బియ్యం కేంద్రం కొనదని తెలిసీ కయ్యానికి దిగకుండా..రా రైస్‌ను మిల్లర్లు ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. అలా ఏయకుండా తమ తప్పిదాన్ని కప్పిపుచ్చి కేంద్రంపై నెపం మోపితే సరికాదు. ధాన్యం కొనుగోళ్లలో ఉన్న తిరకాసును పక్కన పెట్టాలి. కేంద్ర, రాష్టాల్ర మధ్య సంబంధాలు తీవ్ర ఘర్షణపూరితంగా మారకుండా చూసుకోవాలి. బియ్యం పంచాయితీలో నిజాలకు కట్టుబడాలి. సమస్యను కేంద్రంతో పోరాడాలన్న ధోరణితో చూడరాదు. ఈ రకంగా రైతులను తప్పుదోవ పట్టించడం ఎవరికీ సరికాదు.