బిర్సా ముండ ఆశయ సాధనకై కృషి చేయాలి

తెలంగాణ రైతు సంఘం జిల్లా  కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి

కొమురవెల్లి  జనం సాక్షి స్వాతంత్ర సమరయోధుడు విప్లవకారుడు బిర్సా ముండా ఆశయ సాధనకై రైతాంగం నడుము బిగించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి అన్నారు . మంగళవారం కొమురవెల్లి మండల  కేంద్రంలో బీర్సా ముండ జయంతి సందర్భంగా  దేశంలోని అన్ని గ్రామాలలో రైతు సంఘం జెండా దినోత్సవం నిర్వహించాలని అఖిల భారత రైతు సంఘం ఇచ్చిన పిలుపులో భాగంగా రైతు సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటీష్‌కు వ్యతిరేకంగా పోరాటం  చేసిన ఆదివాసీ వీరున్ని సంస్మరణ దినోత్సవం సందర్భంగా లక్షకు పైగా గ్రామాల్లో ఎర్ర జెండాలు ఎగురవేయాలనే ఉద్దేశంతో జండావిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చోటా నాగపూర్ గ్రామంలో ప్రజలను రైతాంగాన్ని సమీకరించి భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహించారని అన్నారు. ఆయన స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం ప్రజా ఉద్యమాలలో ముందు పీఠాన నిలవాలని ఆకాంక్షించారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతుల మనుగడకే నష్టం కలిగించే చర్యలకు పాల్పడ్డారని చైతన్యవంతమైన రైతులు ఏడాది పాటు పోరాడి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాడారని అన్నారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి బద్దిపడగ కృష్ణారెడ్డి మండల నాయకులు చెరుకు వెంకటరెడ్డి సున్నం యాదగిరి నీల బిక్షపతి తాడూరి మల్లేశం కానుగుల రాజు ఆరుట్ల దయానంద్ దాసరి మహేష్ బాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు