బిల్లు చెల్లించలేదని ప్రభుత్వ పాఠశాలకు తాళం
కరీంనగర్ జనంసాక్షి: కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం ఇల్లంతకుంటలోని ప్రభుత్వ పాఠశాలకు మాజీ సర్పంచి బాలయ్య తాళం వేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. గత సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు కొత్తగా రెండు తరగతి గదులతో భవనాన్ని నిర్మించినా, సర్కారు నుంచి ఇంకా బిల్లు రాలేదంటూ కాంట్రాక్టరు అయిన మాజీ సర్పంచి బాలయ్య ఏకంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు రాకుండా పాఠశాలకు తాళం వేశారు. దీంతో విద్యార్థులు వెనుతిరిగారు. మండల విద్యాధికారి సదరు పాఠశాలకు వచ్చి సమస్యపై చర్చిస్తున్నారని సమాచారం.