బిసి స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ
హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ప్లేస్మెంట్ గ్యారెంటీతో పలుకోర్సుల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్ సంచాలకుడు ఎన్ బాలాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్హతలు గల నిరుద్యోగ యువతీ యువకులకు అపోలో వారితో మెడ్స్కిల్స్, స్టెప్ సంస్థ ద్వారా ¬టల్ మేనేజ్మెంట్, జీఎమ్మార్తో ద్విచక్రవాహనాల రిపేరు, సోలార్ టెక్నీషియన్, హౌస్వైరింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తామని అన్నారు. ఆ సమయంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 25లోపు బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయాల్లో తమ పేర్లను నమోదుచేసుకోవాలని అవసరయితే సంప్రదించాలని కోరారు.