బిసి స్టడీ సెంటర్ ను సందర్శించిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా జనంసాక్షి (30 జూలై )

జగిత్యాల జిల్లా కేంద్రం లోని బిసి స్టడీ సెంటర్ ను సందర్శించి కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో ముచ్చటించి స్టడీ సెంటర్ లో అందుతున్న సౌకర్యాలను,విద్య బోధన,స్టడీ మెటీరియల్స్,
బోజన వసతులు అడిగి తెలుసుకొని,విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ గారు.అనంతరం బిసి స్టడీ సెంటర్ మంజూరు,సెంటర్ లో అందుతున్న సౌకర్యాల పట్ల విద్యార్థులు ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలిపి శాలువా తో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ అధికారి సాయి బాబా,మాజీ జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్,అధ్యాపకులు,విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు