. బి ఆర్ఎస్ పార్టీలో చేరికలు.

గుడిహత్నూర్: అక్టోబర్, 8( జనం సాక్షి) రాష్ట్ర ప్రభుత్వంచేపడుతున్నఅభివృద్ధి కార్యక్రమాలను చూసి  మైనారిటీ  యువకులు పెద్ద సంఖ్యలోటిఆర్ఎస్ పార్టీలో
చేరుతున్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. శనివారం మండలంలోని మన్నూరు గ్రామంలో
150 మంది ఎమ్మెల్యే సమక్షంలో గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమపథకాలుఅమలుచేస్తుందని
ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలను ఆదుకునే విధంగా ఆయా పథకాలు రూపకల్పన చేస్తున్నారని కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్శితులై ప్రజలు స్వచ్ఛందంగా బి ఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీ కొరకు కష్టపడే పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకున్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటన చేసిన తర్వాత  పెద్ద మొత్తంలో పెద్దలు యువకులు పార్టీలో చేరడం పార్టీకి లాభదాయకమన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్, కో ఆప్షన్ సభ్యుడు షేక్ జమీర్, రైతుబంధు అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, తోషం ఎంపీటీసీ  సగీర్ ఖాన్,నాయకులు జలంధర్, రాజేశ్వర్, దిలీప్, ఆశన్న, సంతోష్ గౌడ్, అలీఖాన్, సతీష్, రాందాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.
Attachments area