బీఆర్‌ఎస్‌ ఎవరికీ బీ టీమ్‌ కాదు..

మాది ప్రజల టీమ్‌:హరీశ్‌రావు
` కుర్చీ కోసం పార్టీలు మారే రకం రేవంత్‌
` ఆనాడు కరెంట్‌ లేదన్నాడు..సోనియా బలిదేవతన్నాడు
` ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వారికి ఓటేస్తారా?
` తెలంగాణ పాల పిట్ట సీఎం కేసీఆర్‌: మంత్రి
సంగారెడ్డి(జనంసాక్షి): కుర్చీల కోసం పార్టీలు మారే వ్యక్తి రేవంత్‌ రెడ్డి అని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు. జిల్లాలోని నారాయణఖేడ్‌ నియోజికవర్గంలో ఈ నెల 30న సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో రేవంత్‌ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ల నాన్న చనిపోతే అంత్యక్రియలు చేశాక స్నానం చేయడానికి కరెంట్‌ లేదని అసెంబ్లీలో చెప్పారు. ఆనాడు సోనియా గాంధీని బలి దేవత అన్నాడు. ఇటలీ బొమ్మ అన్నాడు. నోటికి ఏదోస్తే అదే తిట్టిండు. ఇప్పుడు సోనియాగాంధీ దేవత అంటున్నాడు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే రకం రేవంత్‌ రెడ్డి నోటికి మొక్కాలన్నారు. రాహుల్‌ గాంధీ వచ్చి నేను బీజేపీతో పోరాడుతా బీజేపీపై పోరాడే డీఎన్‌ఏ నాది అన్నారు. మరి రేవంత్‌ రెడ్డి డీఎన్‌ఏ ఏదో రాహుల్‌ తెలుసుకోవాలని హితవు పలికారు. రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డి డీఎన్‌ఏలు మ్యాచ్‌ కావట్లేదని అన్నారు.  మేం ఎవ్వరికీ బీ టీం కాదని, మేం తెలంగాణ ప్రజల టీం అని మంత్రి అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఎప్పటికి ఒకటి కాదన్నారు. నీళ్లు, నూనె ఎప్పుడైనా కలుస్తాయా? ఇది కూడా అంతేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కి పనితనం తప్ప పగతనం లేదని, కేసీఆర్‌ తలుచుకుంటే రేవంత్‌ రెడ్డిని ఓటుకు నోటు కేసులో జైల్లో వేసేవారన్నారు. పక్క రాష్టాల్లో చూస్తున్నాం. వాళ్లు గెలవగానే వీళ్లను జైలుకు పంపిస్తారు. వీళ్లు గెలవగానే వాళ్లని జైలుకి పంపిస్తారు. అలాంటి పరిస్థితి తెలంగాణలో లేదన్నారు. ఈ నెల 30న నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. సభ ఏర్పాట్లను మంత్రి హరీష్‌ రావు పరిశీలించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిలపై మంత్రి హరీష్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభ నేపథ్యంలో కార్యకర్తల సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొన్నారు.ఇదిలావుంటే సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలోని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం ఇంటికి మంత్రి హరీష్‌ రావు వెళ్లారు. సంగారెడ్డి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి మాణిక్యం భంగపడ్డారు. టికెట్‌ దక్కకున్నా సరే పోటీలో ఉంటానని ఇప్పటికే మాణిక్యం ప్రకటించారు. మాణిక్యంను గత కొన్ని రోజులుగా బీఆర్‌ఎస్‌ అధిష్టానం బుజ్జగిస్తున్నారు. నచ్చజెపేందుకు మంత్రి హరీష్‌ రావు ఇంటికి వచ్చారు. సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలోని డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం ఇంటికి మంత్రి హరీష్‌ రావు వెళ్లారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులకు.. తెలంగాణ కోసం గడ్డి పోచల్లా పదవి త్యాగాలు చేసిన వారి మధ్య ఈ సారి ఎన్నికల్లో పోటీ జరగనుందన్నారు. కేసీఆర్‌ చేతిలో తెలంగాణ రాష్టం ఉంటేనే సుభిక్షంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్‌ అంటేనే మాటలు, మూటలు, ముఠాలు, మంటలని విమర్శించారు. నాడు ఓటుకు నోటు ` నేడు నోటుకు సీటు కాంగ్రెస్‌ తీరు అని తెలిపారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని కిషన్‌ రెడ్డి రాష్టాన్న్రి ఎలా అభివృద్ధి చేస్తారని హరీష్‌ రావు అన్నారు. ధరణి వద్దు అని అంటే పటేల్‌ వ్యవస్థ మళ్ళీ తెచ్చినట్టేనన్నారు. సంగారెడ్డిలో ఈ సారి కచ్చితంగా బీఆర్‌ఎస్‌ జెండా ఎగారేస్తామన్నారు. చింతా ప్రభాకర్‌ గెలుపునకు కృషి చేస్తానని మాణిక్యం హావిూ ఇచ్చారని హరీష్‌ రావు తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ఎన్నికల వాతావరణం చెడగొట్టద్దని సూచించారు. నీటి సుంకం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. బీసీలకు పెద్దపీట వేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. బీఆర్‌ఎస్‌ అంటే బీసీల ప్రభుత్వమని స్పష్టం చేశారు. వేయి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలో ప్రగతికి నిదర్శన మన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ అమలు చేసిన పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ 65 ఏళ్లలో చేసింది ఏమిలేదని విమర్శించారు. రాహుల్‌ గాంధీ ఎన్నికల గాంధీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రాహుల్‌ గాంధీ ఇక్కడ పర్యటించి ఎన్నికల వాతావరణం చెడగొట్టద్దన్నారు. రాష్ట్ర విభజన హావిూలు రాహుల్‌ గాంధీ ఒక్కనాడైన పార్లమెంటులో అడిగారా అని ప్రశ్నించారు.
ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వారికి ఓటేస్తారా?
తెలంగాణ పాల పిట్ట సీఎం కేసీఆర్‌. తెలంగాణలో కేసీఆర్‌ ఒకవైపు.. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తులు మరో వైపు ఉన్నారని తేల్చుకోవాల్సింది ప్రజలేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ మాణిక్యం నివాసంలో విూడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ విధానాలపై మంత్రి ఫైర్‌ అయ్యారు. ఓటుకు నోటు ? నోటుకు సీటు అనే వాళ్లు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. పార్టీ ఆదేశానికి కట్టుబడి సంగారెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సారి సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. పార్టీ పట్నం మాణిక్యం, ఆయన అనుచరులను కాపాడుకుంటున్నది. కర్ణాటక రైతులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామని అక్కడి ప్రభుత్వాన్ని తిడుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు అని ప్రశ్నించారు. దేశంలో కరెంటు కోతలు ఉంటే మనం నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ధరణి వద్దు అంటున్నది. ధరణి వద్దు అంటే పటేల్‌ పట్వారీ వ్యవస్థు తెస్తారా? ధరణిలో లోపాలు ఉంటే సరి చేస్తామని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ కంప్యూటర్‌ మా నాన్న తెచ్చాడు అన్నారు. ఇప్పుడు మేం చేసేంది కంప్యూటరీకరణ. రాష్ట్రం కేసీఆర్‌ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని మంత్రి తెలిపారు.
బీఆర్‌ఎస్‌లో చేరిన ఆవునూరి రమాకాంత్‌రావు
సిరిసిల్లలో బీజేపీకి షాక్‌ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్‌రావు బీజేపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆవునూరి రమాకాంత్‌రావు మాట్లాడుతూ.. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.అంతకుముందు సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆవునూరి రమాకాంత్‌రావు.. బీజేపీపై ఫైర్‌ అయ్యారు. బీజేపీలో పైకి కనబడేది సిద్దాంతం.. లోపల అన్నీ గ్రూపు రాజకీయాలే అని విమర్శించారు. బండి సంజయ్‌ నాయకత్వాన్ని నమ్ముకుని బీజేపీలో చేరామని.. కానీ మాకు అన్యాయం జరిగితే ఆయన నోరు మెదపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులతో చర్చించకుండా నర్సంపేటకు చెందిన రాణి రుద్రమకు సిరిసిల్ల టికెట్‌ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై మనస్తాపంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.