బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో యువతకు తీవ్ర ఇబ్బందులు

` అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
` కాంగ్రెస్‌ సర్కార్‌ చేతిలో భద్రంగా యువత భవిష్యత్తు:రాహుల్‌
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణలో నిరుద్యోగ యువత పడుతున్న ఇబ్బందులపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ స్పందించారు. కేసీఆర్‌ ప్రభుత్వ పాలనలో తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల తాను హైదరాబాద్‌ అశోక్‌నగర్‌లో పర్యటించిన సమయంలో ఈ విషయం స్పష్టం అయినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు రాహుల్‌ గాంధీ వీడియో విడుదల చేశారు.‘‘తెలంగాణ నిరుద్యోగ యువత బాధను తగ్గించేందుకు ‘ఉద్యోగ క్యాలెండర్‌’తో కాంగ్రెస్‌ తొలి అడుగు వేసింది. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ుూఖూఅ)ని ప్రక్షాళన చేస్తాం. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల సహాయం చేస్తాం. యువత భవిష్యత్తు కాంగ్రెస్‌ ప్రజా సర్కార్‌ చేతిలో భద్రంగా ఉంటుంది. అందుకు మాదే గ్యారంటీ’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.