బీఎస్‌ఈదే ప్రపంచంలో ప్రథమస్థానం
ముంబయి: ప్రపంచ స్టాక్ ఎక్సేంజిల్లో టాప్ ఎక్సేంజ్‌గా నిలిచింది బోంబే స్టాక్ ఎక్చ్సేంజ్. లిస్టెడ్ కంపెనీల సంఖ్య అత్యధికంగా కలిగిన బీఎస్‌ఈ న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజిని,నాన్‌డాక్‌ని, లండన్ స్టాక్ ఎక్సేంజిని పక్కకునెట్టి ప్రధమ స్థానం సంపాదించింది. బీఎస్‌ఈలో 5,174 లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్సేంజ్ తాజా లెక్కల ప్రకకారం కెనడా రెండో స్థానంలో నిలవగా, మన ఎన్‌ఎన్‌ఈ పదోస్థానంలో నిలిచింది.