బీఎస్‌ఎఫ్ సిబ్బందికి రాజ్‌నాథ్ ఘననివాళి
న్యూఢిల్లీ,డిసెంబర్23(జనంసాక్షి): విమాన ప్రమాదంలో మరణించిన బీఎస్‌ఎఫ్ సిబ్బందికి కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. మంగళవారం దిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బీఎస్‌ఎఫ్ సూపర్‌కింగ్ విమానం కూలిపోవడంతో విమానంలోని 9 మంది బీఎస్‌ఎఫ్ సిబ్బంది, మరొకరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దిల్లీలోని సఫ్దర్‌జంగ్ విమానాశ్రయం వద్ద మృతులకు నివాళులర్పించే కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆయనతోపాటు కేంద్ర ¬ంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు, దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మృతులకు నివాళులర్పించారు. అక్కడికి వచ్చిన మృతుల కుటుంబసభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. రాజ్‌నాథ్‌ను చుట్టుముట్టి ప్రమాదంపై ప్రశ్నించారు. ప్రమాద ఘటనపై రాజ్‌నాథ్‌సింగ్ నిన్న దర్యాప్తునకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రమాద మృతుల కుటుంబాలను రాజ్‌నాథ్ పరామర్శించి ఓదార్చారు.