బీజేపీతో కలిసి పనిచేస్తాం – ఎర్రబెల్లి దయాకరరావు

హైదరాబాద్‌ : గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని టీ.టీడీపీ నేత ఎర్రుబెల్లి దయాకరరావు అన్నారు. బీజేపీతో తెలుగుదేశం పార్టీ స్నేహం కొనసాగుతుందని, ఇరుపార్టీల నేతలు మరోసారి చర్చలకు కూర్చుంటామని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్డీఏలో చేరడానికి ప్రయత్నించినా, బీజేపీ అందుకు సముఖంగాలేదని తెలుస్తోందని ఆయన అన్నారు. మహారాష్ట్ర వెళ్లిన సీఎం కేసీఆర్‌ బాబ్లీపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టు వల్ల ఎస్సారెస్పీ ఎడారిగా మారింది. నీటి కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఓ మెట్టు దిగారు. విద్యుత్‌ కోతలపై మరి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన అన్నారు.