బీజేపీలో అంతర్గత విభేదాలు లేవు: వెంకయ్యనాయుడు
హైదరాబాద్, (జనంసాక్షి): బీజేపీలో అంతర్గత విభేదాలు లేవని బీజేపీ సీనియర్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూడలేకే కాంగ్రెస్ పార్టీ పుకార్లు సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రధాని అభ్యర్థిపై పార్టీలో ఇంకా చర్చ జరగలేదని తెలిపారు. తెలంగాణను వ్యతిరేకించే పార్టీలతో పొత్తులుండవని, అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.