బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ బిజెపి పార్టీ ఇన్చార్జి మురళీధరరావు

ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని బాలాజీ గార్డెన్స్లో భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం కు ముఖ్య అతిధిగా  మధ్యప్రదేశ్ బిజెపి పార్టీ ఇన్చార్జి మురళీధరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిదిన్నర సంవత్సరాల తెరాస పాలనలో పూర్వ రంగారెడ్డి జిల్లాను పరిపాలన సౌలభ్యం కోసమని మూడు జిల్లాలుగా చేసిన సమస్యలు పరిష్కారం కాకపోగా రెట్టింపు అయ్యాయని,ఎట్టకేలకు జిల్లా పరిధిలో కలెక్టరేట్ ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్లు కార్యాలయాలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయన్నారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీళ్లు,నిధులు, నియామకాలు సవ్యంగా జరుగక పోవడంతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారని,రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం,జిల్లాలో పట్లోళ్ల కుటుంబం ఆడిందే ఆటగా,పాడిందే పాటగా కొనసాగుతుంటే మరొకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఆస్తులు పెంచుకోవడంలో ఉన్న ఆసక్తి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం దారుణమని, తెరాస అవినీతి పాలనకు బిజెపి తొందరలోనే చరమగీతం పాడుతుందన్నారు. జిల్లాలోని కడ్తాల్, కందుకూర్, యాచారం మండలాలలో సుమారు 19 వేల ఎకరాలలో ఫార్మాసిటీ ఏర్పాటు చేయడాన్ని,యాచారం మండలంలో మైనింగ్ జోన్లు రద్దుచేసి ఈ ప్రాంతాల రైతులకు న్యాయం చేయాలని జిల్లా బిజెపి డిమాండ్ చేస్తుంది.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర దళిత మోర్చా అధ్యక్షులు కొప్పు బాషా   జాతీయ బీసీ సభ్యులు ఆచారి, జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు  బూర నర్సయ్య గౌడ్,వీరేందర్ గౌడ్, పోరెడ్డి నరసింహారెడ్డి, ముత్యాల భాస్కర్ , నాయిని సత్యనారాయణ,జక్కా రవీందర్ రెడ్డి, పోరెడ్డి అర్జున్ రెడ్డి ఎంపీపీ కొప్పు సుకన్య , మండలాల అధ్యక్షులు దండే శ్రీశైలం, తాండ్ర రవీందర్, నాయకులు ముత్యాల మహేందర్ బూర దిలీప్ గౌడ్,పగడాల శ్రీశైలం, బిజెపి శ్రేణులు పాల్గొన్నారు