బీజేవైఎం నాయకుడి ఆత్మహత్య
చొప్పదండి: చొప్పదండి మండల కేంద్రానికి చెందిన బీజేవైఎం మండల ఉపాధ్యక్షుడు నరేష్ గౌడ్(26) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని తట్టుకోలేక గత కొద్దిరోజులుగా మనో వేదనంతో ఉండేవాడని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు. తెలంగాణా ఏర్పాటు కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరుతూ రాసిన లేఖను జేబులో పెట్టుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.