బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి

ఇతరవృత్తుల్లో స్థిరపడుతున్న మహిళా కార్మకులు
బీడీలకు తగ్గిన ఆదరణతో మూతపడుతున్న సంస్థలు
నిర్మల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): జిల్లాలో బీడీ పరిశ్రమ ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. రోజురోజుకూ బీడీ పరిశ్రమ బలహీన పడుతుండటం కార్మికులకు శాపంగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు, పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రచారాలు, సిగరెటఁ వినియోగ ప్రాబల్యం పెరగడం లాంటి అంశాలన్నీ బీడీ పరిశ్రమను దెబ్బతీస్తూ వస్తున్నాయి. వేలాది మంది బీడీ కార్మికులకు ఉపాధిపై భరోసా రోజురోజుకూ కరవవుతున్న క్రమంలో ప్రభుత్వం బీడీ కార్మికులు, వారి కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. పొగాకు దుష్ఫలితాలపై సమాజంలో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం లక్షలాది మంది బీడీ కార్మికుల జీవనాన్ని ప్రభావితం చేస్తోంది. కారణం.. బీడీ పరిశ్రమ కేంద్రీకృతమైన ఈ ప్రాంతంలో ప్రత్యామ్నాయ ఉపాధి కరవైంది. బీడీ వినియోగం తగ్గిపోవడంతో ఈ పరిశ్రమ యజమానులు ఉత్పత్తిని తగ్గిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో బీడీకి డిమాండ్‌ వారిపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ స్వయం ఉపాధిపై, వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి తాత్కాలిక ఉద్యోగులుగా తీసుకోనున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకొని వీరంతా జీవనం సాగిస్తున్నారు. బీడీ పరిశ్రమ సంక్షోభంలో నెట్టుకొస్తున్న తరుణంలో ప్రభుత్వం వీరికి ఉపాధి అవకాశాలు కల్పించడంతో బతుకులు బాగుపడనున్నాయి. బీడీ కార్మికులతో పాటు వారిపై ఆధారపడ్డ వారందరికీ స్వయం ఉపాధి దినసరి ఉద్యోగాలుగా పనులు చేసేందుకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నిర్మల్‌ జిల్లాలో ఉన్న 60 వేల మంది కార్మికులతో పాటు వారిపై ఆధారపడుతున్న దాదాపు మరో 1.50 లక్షల మందికి ఉంటారని కార్మికశాఖ అధికారులు అంచనా వేశారు. నిర్మల్‌, భైంసా పట్టణాల్లో 20 మంది ఒక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసేందుకు కార్మికశాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వారందరికీ స్వయం ఉపాధి పొందేందుకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉద్యానవనం (పండ్లు, పూలు, కూరగాయల సాగు), కోళ్ల పరిశ్రమ, గేదెలు, గొర్రెల పెంపకం, కుట్టు శిక్షణ, ఎంబ్రాయిడరీ, చేతి వృత్తులు, అగర్‌బత్తుల తయారీ, పాపడ్‌, పచ్చళ్ల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. వీటితో పాటు వివిధశాఖల్లో దినసరి ఉద్యోగాలుగా పనులు చేసేందుకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో టైలరింగ్‌, బ్యూటీషియన్‌, బ్యాంకింగ్‌, ్గªనాన్స్‌, బీమా ఏజెంట్లు, ఆసుపత్రుల్లో సేవలు, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నిషీయన్స్‌, పశువైద్య సేవలపై శిక్షణ ఇవ్వనున్నారు. బీడీ కంపెనీలు ఎప్పుడు మూతపడుతున్నాయో తెలియని పరిస్థితి ఏర్పడిరది. బీడీలు చుట్టుడమే జీవనాధారంగా ఉన్న అనేక కుటుంబాల భవితవ్యం ప్రశ్నార్థకం అవుతుంది. ఇప్పుడు స్వయం ఉపాధిపై శిక్షణ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. వీటితో పాటు స్వయం ఉపాధి పొందేందుకు రుణ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. బీడీ కార్మికుల ప్రత్యామ్నాయ ఉపాధి చూపించడానికి ఆసక్తి ఉన్న కార్మికుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నిర్మల్‌, భైంసా ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసారు.