బీడీ కార్మికుల కనీస వేతనాన్ని దేశ వ్యాప్తంగా ఒకే విధంగా వేతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలి

కరీంనగర్‌:  బీడీ కార్మికుల కనీస వేతనాన్ని దేశ వ్యాప్తంగా ఒకే విధంగా వేతనం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేస్తూ బీడి కార్మికుల సంక్షేమనిధిలో ఉద్యొగుల టీఏ డీఏలకు ఖర్చు చేయకూడది నూటికి నూరుశాతం  బీడీ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని బీడీ కార్మికుల పిల్లలకు ష్కాలార్‌షిప్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని బీడీ కార్మికుల పిల్లల పెళ్లికి గతంలో ఇచ్చిన 5వేల సహయనిధి 25వేలకు పెంచాలని కార్మికుల ఇండ్ల నిర్మాణానికి 80వేలనుంచి లక్షకు పెంచాలని బీడి కార్మికులకు నెలకు 3వేల పెంక్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఉద్యొగులకు మెడికల్‌ రిఎంబర్స్‌మెంట్‌ లాగా బీడి కార్మికులకు కల్పించాలని ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలి కేంద్ర బడ్జెట్‌లో బీడి కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక నిధలు కేటాయించాలని అఖిల భారత బీడి మజ్జూరు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి  శ్రీధర్‌ దాస్‌ శుక్ల అన్నారు. సుధీర్‌కుమార్‌, అలువాల తీరుపతి గొంటి శంకర్‌, రాంచద్రరెడ్డి శ్రీనివాస్‌ యాదవ్‌ రాజు పాల్గొన్నారు.

తాజావార్తలు