బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి
` ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి: కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి):కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కులగణన సర్వే తప్పుల తడకని ప్రభుత్వం ఒప్పుకోవడాన్ని స్వాగతిస్తున్నట్టు చెప్పారు. అసంపూర్తి లెక్కలతో అసెంబ్లీలో తీర్మానం తప్పేనని అంగీకరించాలని, మనో వేదనకు గురిచేసినందుకు బీసీలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రెండోసారి అయినా సర్వే సమగ్రంగా చేయాలని సూచించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, రిజర్వేషన్ల అంశాన్ని కేంద్ర పరిధిలోకి నెడితే అంగీకరించే ప్రసక్తే లేదని కేటీఆర్ అన్నారు.