బీసీలను అణగదొక్కుతున్నారు
` కాంగ్రెస్‌లో సీనియర్లకు అవమానం జరుగుతోంది
` మంత్రులు కేటీఆర్, హరీశ్‌లు ధ్వజం
` బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన చెరుకు సుధాకర్
` రాష్టాభ్రివృద్దిపైనే కేసీఆర్ దృష్టి
` పగసాధించివుంటే రేవంత్ జైలులో ఉండేవాడు
` మండిపడ్డ మంత్రులు
హైదరాబాద్,అక్టోబర్21(జనంసాక్షి): కాంగ్రెస్, బిజెపిల తీరుతో విసిగిన అనేకమంది బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని మంత్రులు హరీష్ రావు, కెటిఆర్‌లు అన్నారు. వివిధ పార్టీల్లో ఇమడలేక, తెలంగాణ అభివృద్ది లక్ష్యంగా పనిచేస్తున్న బిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. ఇందుకు పొన్నాల లక్ష్మయ్య, చెరుకు సుధాకర్‌ల ఆగమనమే నిదర్శనమని అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు కలిసి చెరుకు సుధాకర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, చిరుమర్తి లింగయ్య, గాయకుడు ఏపూరి సోమన్నతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్పయ్రోజనం అని భావించి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక పరిపుష్టి కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, మధుయాష్కీ వంటి బీసీల నేతల స్థాయిని తగ్గిస్తూ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ చెప్తున్న సామాజిక న్యాయం కేవలం రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ మాటల్లో తప్ప ఆచరణలో లేదని విమర్శించారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ చివరకు మోసం చేసిందని దుయ్యబట్టారు. బీసీలకు కేటాయించిన 12 సీట్లలో ఐదు చోట్ల ఎప్పుడూ కాంగ్రెస్‌కు డిపాజిట్ రాలేదని చెప్పారు. వీటిని పట్టుకుని బీసీలకు 12 సీట్లు ఇచ్చామంటూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెక్కిరింపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య రాజీనామా సమయంలో రేవంత్‌రెడ్డి అత్యంత అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పని తనమే తప్ప పగతనం లేని నాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. నిజంగా కేసీఆర్‌కు పగ ఉంటే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ఎప్పుడో జైల్లో కూర్చునేవాడు. కేసీఆర్ ఎంతసేపు ప్రజలకు ఏం చేయాలో ఆలోచిస్తారని హరీశ్‌రావు స్పష్టం చేశారు. మంచినీళ్లు, కరెంట్, ప్రాజెక్టులు ఎలా ఇవ్వాలో కేసీఆర్ ఆలోచించారని హరీశ్‌రావు గుర్తు చేశారు. కేసీఆర్‌కు పని విూద, ప్రజల విూద ధ్యాస, అట్టడుగు వర్గాలపై ప్రేమ. నా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆలోచించే నాయకుడు కేసీఆర్. కులమతాలకు అతీతంగా కేసీఆర్‌ను మూడోసారి గెలిపించుకోవాలి. ఇవాళ రాష్ట్రం సంతోషంగా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం కేసీఆర్. కేసీఆర్ ఉన్న తొమ్మిదిన్నరేండ్లలో కరువు, కర్ఫ్యూ లేదు. కాంగ్రెసోళ్లు వస్తే కరువులు, కర్ఫ్యూలు తప్పకుండా వస్తాయని హరీశ్‌రావు హెచ్చరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా హరీశ్‌రావు ప్రసంగించారు. సుధాకర్ అన్న సొంతింటికి రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో ఉండి, కరుడుగట్టిన ఉద్యమకారుడిగా పని చేశారు. తెలంగాణ కోసం ఎంతో కష్టపడ్డవారు. ఇవాళ బాగా ఆలోచించి ఈ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వం ఉంటేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని నమ్మి, మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోనే బీఆర్‌ఎస్ పార్టీలో చేరారని హరీశ్‌రావు తెలిపారు. ఉద్యమకారులపై తుపాకీ గురి పెట్టిన వ్యక్తి.. ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డేమో ఉద్యమ సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయారు. వెన్నుచూపి పారిపోయిన వ్యక్తి కిషన్ రెడ్డి. తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడ్డ నేత కేసీఆర్ అని తెలిపారు. నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చిండు. బీజేపీకి వ్యతిరేకండగా పోరాడడమే నా డీఎన్‌ఏలో ఉన్నదని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి డీఎన్‌ఏలో ఏమున్నదో కనుక్కోండి. ఏబీవీపీ, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉన్నదా..? బీఆర్‌ఎస్ ఉన్నదా..? కాంగ్రెస్ ఉన్నదా..? ఆయన డీఎన్‌ఏలో ఏమున్నదని అడుగుతున్నానని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్ని పార్టీలు మారిండు ఆయన. విూ డీఎన్‌ఏ, ఆయన డీఎన్‌ఏ మ్యాచ్ అవుతదలేదు. అది సరి చేసుకోండి. ఓటుకు నోటు చేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగను పక్కన పెట్టుకుని రాహుల్ అవినీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. రాహుల్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కరువయ్యారని హరీశ్‌రావు పేర్కొన్నారు. నీ తల్లిని బలిదేవత, బండబూతులు తిట్టిన వ్యక్తికి పీసీసీ అధ్యక్షుడిగా నియమించుకున్నారు. కుటుంబ పాలన అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో గాలి లేదు. అభ్యర్థులను డిక్లేర్ చేస్తలేవు. విషయం లేక రాహుల్, రేవంత్ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ గాంధీ తన పేరును రాంగ్ గాంధీగా మార్చుకోవాలి. అబద్ధాలు ప్రచారం చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఛత్తీస్‌గఢ్‌లో ధాన్యం కొన్నామని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మన కేసీఆర్ పండిరచిన పంటంత కొన్నాడు. ఛత్తీస్‌గఢ్‌లో కేవలం ఎకరానికి 13 క్వింటాల్స్ కొన్నారు. యాసంగిలో ధాన్యం అసలే కొనలేదు కాంగ్రెస్ పార్టీ అని హరీశ్‌రావు మండిపడ్డారు. కర్ణాటకలో ఐదు గంటల కరెంట్ కూడా వస్తలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మంత్రి తెలిపారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. తెలంగాణను వచ్చి ఉద్దరిస్తం అంటే మోసం చేయడం కాదా..? రాజస్థాన్, హిమాచల్‌లోనూ అదే పరిస్థితి. కేసీఆర్ పాలన గొప్పగా ఉంది. మాట విూద ఉండే నాయకుడు కేసీఆర్. మన మేనిఫెస్టోను, పథకాలను కాంగ్రెస్ కాపీ కొట్టింది. రైతుబంధు ఆలోచన సృష్టికర్త కేసీఆర్. కేసీఆర్ మళ్లీ గెలవాలి. మన తెలంగాణ అభివృద్ధిలో పరుగులు పెట్టాలి. కాంగ్రెస్ చేతిలో పెడితే తెలంగాణ ఆగమైపోతదనే విషయం గ్రహించాలని హరీశ్‌రావు సూచించారు.