భారత్-పాక్ ఉద్రిక్తతలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. మధ్యవర్తిత్వానికి నిరాకరణ

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. శుక్రవారం రోమ్ పర్యటనకు బయలుదేరే ముందు విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన చెందుతున్నారా? ఇరు దేశాల నేతలతో మాట్లాడతారా? అని విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందించారు. “ఆ సరిహద్దులో ఉద్రిక్తతలు చాలా కాలంగా ఉన్నాయి. పాకిస్థాన్ గతంలో మధ్యవర్తిత్వాన్ని కోరినప్పటికీ, ఈసారి కోరిందో లేదో స్పష్టత లేదు. భారత్-చైనా సరిహద్దు వివాదంలోనూ ట్రంప్ మధ్యవర్తిత్వ ప్రతిపాదనను భారత్ నిరాకరించింది.అయితే, ఈసారి మధ్యవర్తిత్వానికి ట్రంప్ ఆసక్తి చూపనప్పటికీ, పహల్గామ్ ఉగ్రదాడిని మాత్రం ఆయన, అమెరికా అధికారులు తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన కొద్ది గంటల్లోనే ట్రంప్ భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి సంతాపం తెలిపారు, మద్దతు ప్రకటించారు. అమెరికా జాతీయ గూఢచార సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ కూడా పహల్గామ్ దాడిని ఖండిస్తూ, బాధ్యులను పట్టుకోవడంలో భారత్‌కు మద్దతు తెలిపారు. “ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని వేటాడటంలో మీకు మా మద్దతు ఉంటుంది” అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

తాజావార్తలు