మళ్లీ అధికారం మాదే.. తేలిపోయింది
` ప్రభుత్వ అరాచకాలను మరింతగా ఎండగడతాం: కేటీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో తిరిగి అధికారంలోకి వచ్చేది భారాసనేనని, రజతోత్సవ సభకు లక్షలాదిగా వచ్చిన ప్రజలు చెప్పిన సందేశం ఇదేనని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.ఎల్కతుర్తితో ఆదివారం జరిగిన భారాస రజతోత్సవ సభపై భారాస నాయకులు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.‘’భారాస రజతోత్సవ సభ విజయవంతం చేసిన తెలంగాణకు ధన్యవాదాలు. దేశ రాజకీయ చరిత్రలో అతిపెద్ద సభల్లో ఒకటిగా నిలిచిపోతుంది. నిన్నటి సమావేశం రజతోత్సవ కార్యక్రమాలకు ప్రారంభం మాత్రమే. ఇకపై తానే ముందుండి పోరాడతానని కేసీఆర్ ప్రకటించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సమయం ఇచ్చాం. ఇకపై ప్రతి అంశంపై ప్రభుత్వాన్ని వెంటాడుతాం. ప్రభుత్వ అరాచకాలను మరింతగా ఎండగడతాం’’అని కేటీఆర్ అన్నారు.