బీసీల పట్ల వివక్ష చూపుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు

జాజుల లింగంగౌడ్
మిర్యాలగూడ, జనం సాక్షి.
 చదువు కోసం సామాజిక న్యాయం కోసం డిసెంబర్ 7 న ఉదయం 10 గంటలకు పట్టణంలోని “మార్కండేయ ఫంక్షన్ హాల్ లో ” కుండల బజారు వీధి లో జరిగే బీసీల పోరు యాత్రను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగాఆయన బీసీ వసతి గృహా విద్యార్థులతో మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడుతూ చదువుకోసం,సామాజిక న్యాయ సాధనకోసం పాలమూరు నుండి పట్నం వరకు డిసెంబర్ 2 నుండి జనవరి 8 వరకు జరిగే బీసీ విద్యార్థి,యువజనుల పోరుయాత్ర డిసెంబర్ 7 న మిర్యాలగూడకు చేరుకుంటుందని ఆ యొక్క సభ స్థానిక మార్కెoడేయ ఫంక్షన్ హాల్లో జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ  విజయంవంతం చేయాలని లింగంగౌడ్ పిలుపునిచ్చారు.స్కాలర్ షిప్స్,ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా బడుగు బలహీన వర్గాలక విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు.ఉన్నత విద్యకు బడుగులను దూరం చేస్తున్నారన్నారు. విద్యార్థుల బలిదానాలతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చదువుకోసం మళ్ళీ సమరం సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు.న్యాయాన్ని తుంగలో తొక్కి రాష్ట్రంలో శాశ్వతంగా రెండు, మూడు శాతం లేనివారు అధికారాన్ని చెలాయించాలని చూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది బీ.సి. విద్యార్థులను జాగృతం చేయాలనే లక్ష్యంగా ఈ యాత్ర చేపడుతున్నామని అన్నారు. ర్యాంక్ తో సంబంధం లేకుండా ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.పెరిగిన ధరలకి అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచాలని,అదే విధంగా ప్రైవేట్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు,మహేష్ గౌడ్,ఆంజి యాదవ్,వేణు,బ్రహ్మాo,చందు,ఆకాష్,రఘు,సాయి,విజయ్,మణికంఠ,సతీష్,వంశీ,రఘు,రాంబాబు,సంజీవ్,రాము తదితరులు పాల్గొన్నారు