బీసీసీఐని బుజ్జగిస్తున్న క్రికెట్‌ ఆస్ట్రేలియా

మెల్‌బోర్న్‌: ఈ ఏడాది కోహ్లీసేన వరుసగా టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా గడపనుంది. ఐపీఎల్‌ అనంతరం టీమిండియా వన్డే, టీ20, టెస్టు సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లనున్న విషయం తెలిసిందే. జులైలో ఈ పర్యటన ప్రారంభం కానుంది. తాజాగా క్రికెట్‌ ఆస్ట్రేలియా 2018-19కి సంబంధించి ఆసీస్‌ ఆడే క్రికెట్‌ మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది. 2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్‌-ఆసీస్‌ మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌లు జరగనున్నట్లు పేర్కొంది. ఈ పర్యటనలో భారత్‌ ఆతిథ్య ఆసీస్‌తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. పర్యటనలో టీ20 సిరీస్‌తో భారత్‌ తన పర్యటనను ప్రారంభించనుంది.  

షెడ్యూల్‌:

మొదటి టీ20: నవంబరు 21- గబ్బా

రెండో టీ20: నవంబరు 23- మెల్‌బోర్న్‌

మూడో టీ20: నవంబరు 25- సిడ్నీ

మొదటి టెస్టు: డిసెంబరు 6 – ఆడిలైట్‌

రెండో టెస్టు: డిసెంబరు 14 – పెర్త్‌

మూడో టెస్టు: డిసెంబరు 26 – మెల్‌బోర్న్‌(బాక్సింగ్‌ డే టెస్టు)

నాలుగో టెస్టు: జనవరి 3- సిడ్నీ

మొదటి వన్డే: జనవరి 12- సిడ్నీ

రెండో వన్డే: జనవరి 15- ఆడిలైట్‌

మూడో వన్డే: జనవరి 18- మెల్‌బోర్న్‌

ఈ మూడు సిరీస్‌ల్లో ఆసీస్‌ ఆటగాళ్లు స్మిత్‌, వార్నర్‌ ఆడలేరు. బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా వీరిద్దరిపై విధించిన 12 నెలల నిషేధం 2019 మార్చిలో ముగియనుంది. దీంతో వీరు ఈ సిరీస్‌కు దూరం కానున్నారు. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్‌క్రాఫ్ట్‌ భారత్‌తో వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండనున్నాడు.