బీసీసీఐ క్యూరేటివ్ పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ: కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ (పరస్పర విరుద్ధ ప్రయోజనాలు)-2015కు సంబంధించి బీసీసీఐ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను త్రిసభ్య బెంచ్ తోసిపుచ్చింది. బోర్డు సభ్యులకు వాణిజ్యపరమైన ఐపీల్, చాంపియన్స్ లీగ్‌ల్లో జట్లు ఉండకూదని, ఇందుకు సంబంధించిన నిబంధనకు సవరణ చేయాలని గతేడాది జనవరి 22న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.