బీహార్‌లో వేడెక్కిన ఎన్నికల పోరు

3

– నితీష్‌, లాలూలపై మోదీ విమర్శ

న్యూఢిల్లీ,జులై25(జనంసాక్షి):

ప్రధాని నరేంద్ర మోదీ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు . ఏక కాలంలో అటు అధికార జెడియూను, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీని ఏకిపారేశారు. తనపై ఉన్న కోపానికి బీహార్‌ ప్రజలను బలి చేశారంటూ నితీశ్‌పై విరుచుకుపడ్డారు. వ్యక్తిగత విషయాల కోసం మొత్తం బీహార్‌ ప్రజలను ఫణంగా పెట్టారని నితీశ్‌పై నిప్పులు కురింపించారు. అదే సమయంలో ఆర్జేడీ అంటే రోజానా జంగల్‌ రాజ్‌కా డర్‌ అని చమత్కరించారు. అంటే ఆటవిక పాలనంటే రోజూ భయపడటం. తానిచ్చిన హావిూలను నెరవేర్చుకునేతత్వం తనలో ఉందన్న ఆయన త్వరలో పార్లమెంట్‌ నుంచి బీహార్‌కు ఇవ్వబోయే ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రకటన చేస్తానన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే రాష్టాన్న్రి  అభివృద్ధి బాట పట్టిస్తానన్నారు. ఇక్కడ ఎన్‌డిఎ పాలన ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతందని, సేవ చేసే భాగ్యం తమకు దక్కుతుందని అన్నారు. మోదీ పర్యటనతో బీహార్‌ బిజెపి శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది.త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్‌ రాష్ట్రంపై  ప్రధాని హావిూల వర్షం కురిపించారు. పలు ప్రభుత్వ పథకాలనుప్రారంభించేందుకు ఆయన శనివారం బీహార్‌ లో పర్యటించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ,  లోక్‌ సభ ఎన్నికలకు ముందు బీహార్‌లో పర్యటించినప్పడు రూ. 50 వేల కోట్ల  ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని హావిూ ఇచ్చానని, అయితే, అంతకంటే ఎక్కువ ఆర్థిక ప్యాకేజీని బీహార్‌కు సరైన సమయంలో ప్రకటిస్తామని ఆయన హావిూ ఇచ్చారు. కేంద్ర ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నట్లు నితిన్‌ చెప్పారని అయితే  బీహార్‌ను అభివృద్ధి చేయడం తన  ప్రాధమిక బాధ్యతని ఆయన అన్నారు.  ఈశాన్య రాష్టాల్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని చెప్పారు. వ్యక్తిగత విషయాల కోసం బీహారు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ రాష్ట్ర ప్రజలను పణంగా పెట్టారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు త్వరలో ప్యాకేజీ ప్రకటిస్తామని చెప్పిన ఆయన నితీష్‌ తో పాటు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పై విమర్శల వర్షం కురిపించారు.బీహారులో మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తున్నారని ఆయన ద్వజమెత్తారు. ఆర్జెడి అంటే ఆటవిక పాలన అని ఆయన మండిపడ్డారు. రోజు భయపడే పరిస్థితి బీహారులో ఏర్పడకూడదని ఆయన అన్నారు. తాను చెప్పిన వాగ్దానాలను నిలబెట్టుకుంటానని మోడీ అన్నారు. బీహారులో బిజెపిని గెలిపిస్తే అభివృద్ది పథంలోకి తీసుకు వెళతామని మోడీ చెప్పారు.