బీహార్ తొలిదశ పోలింగ్ ప్రశాంతం
– 57 శాతం ఓటింగ్
పాట్నా, అక్టోబర్12(జనంసాక్షి):
హైదరాబాద్: బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ముగిసింది. 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్ జరగగా 57 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2010 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో 50.85 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి గతంతో పోలిస్తే పోలింగ్ శాతం పెరిగింది. పురుష్ళలతో పోలిస్తే ఈ సారి మహిళలు అధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు 59.5శాతం పోలింగ్‌లో పాల్గొనగా పురుష్ళలు 54.5శాతం పోలింగ్‌లో పాల్గొన్నారు. 49 నియోజకవర్గాల్లో మొత్తం 1.35కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 72లక్షల మంది పురుష్ళలు, 63లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
ఖగారియాలో 61శాతం, సమస్తిపూర్‌లో 60 శాతం, బెగుసరాయ్‌లో 59 శాతం, భగల్‌పూర్‌లో 56శాతం, బంకాలో 58శాతం, ముంగుర్‌లో 55శాతం, లఖిసరాయ్‌లో 54శాతం, నావాడాలో 53శాతం, జముయ్‌లో 57శాతం, షేక్‌పురాలో 54శాతం పోలింగ్‌లు నమోదయ్యాయి.
తొలి దశలో 10 జిల్లాలోని 49 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగగా, 583 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 13,212 పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రత నడుమ పోలింగ్ ముగిసింది. తొలిదశలో 80 నుంచి 90వేల మంది సిబ్బంది విధులు నిర్వర్తించారు.
49 నియోజకవర్గాల్లో భాజపా 27 మంది అభ్యర్థులను నిలబెట్టింది. జేడీయూ నుంచి 24 మంది, ఆర్జేడీ నుంచి 17 మంది, ఎల్‌జేపీ నుంచి 13 మంది, ఆర్‌ఎల్‌ఎస్‌పీ నుంచి ఆరుగురు హెచ్‌ఏఎం నుంచి ముగ్గురు, కాంగ్రెస్ నుంచి 8 మంది పోటీపడ్డారు. ఈ దశలో పోటీలో ఉన్న ప్రముఖులు.. సీనియర్ మంత్రి విజయ్ ాదరి( సరయ్ రాంజన్ నియోజకవర్గం), ప్రముఖ కాంగ్రెస్ నేత, అసెంబ్లీ మాజీ స్పీకర్ సదానంద సింగ్( కహల్గాం), ఎల్‌జేపీ రాష్ట్ర చీఫ్ పశుపతి కుమార్ పరస్(అలౌలి). ఎల్‌జేపీ చీఫ్ రాంవిలాస్ పాసవాన్ తమ్ముడు పశుపతి పరస్. కాగా బీహార్ అభివృద్ధి చెందాలంటే తమకు అవకాశం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలను కోరారు. బిహార్‌లోని జహానాబాద్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధి కోసం ఓటు వేయాలా? వద్దా? అని ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు.అధికారం, స్వార్థం కోసమే జేడీయూ, ఆర్జేడీలు కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ఉన్నది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకేనని అన్నారు. బిహార్ ఆర్థికంగా బలోపేతం కావాలన్నా.. యువతకు ఉపాధి లభించాలన్నా.. ఎన్డీయేకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ‘నేను ప్రత్యేకంగా యువ స్నేహితులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. యువకులంతా అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ’ ఎన్నుకోవాలని కోరుతూ ట్టిట్టర్‌లో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇదిలావుంటే బీహార్ శాసన సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఇవాళ ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 49 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో 583 మంది
అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. కోటి 35లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. మొత్తం 243నియోజకవర్గాలు ఉన్న బిహార్ రాష్ట్రంలో ఈరోజు 49 నియోజక వర్గాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని ఎన్డీయే కూటవిూ, లౌకిక కూటమిలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 10 జిల్లాల్లో 49 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ప్రజలు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా భద్రతా బలగాలు కేంద్రాల వద్ద పహారా కాస్తున్నారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని కొన్నిచోట్ల నాలుగు గంటలకు, మరికొన్ని చోట్ల మూడు గంటలకే పోలింగ్ పక్రియను ముగించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికలో 80వేల మందికిపైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 243 నియోజకవర్గాలున్న బిహార్ అసెంబ్లీకి నవంబర్ 5 వరకు ఐదు దశల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలు ముగిసే సమయానికి 20.15శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా జుమూయ్ జిల్లాలో 23.50శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 10 జిల్లాల్లోని 49 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి అక్కడ 27.34శాతం పోలింగ్ నమోదయ్యిందని అధికారులు తెలిపారు. ఈ విషయమై అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆర్ లక్ష్మణన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకున్నట్లు తమకు సమాచారం అందలేదని తెలిపారు.